2011 తరువాత తొలి టెస్టు?

11 Mar, 2017 15:10 IST|Sakshi

రాంచీ: భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ కు అనూహ్యంగా చోటు దక్కింది. ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కాలి గాయంతో సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన నేపథ్యంలో కమిన్స్ కు స్థానం కల్పించారు. ఇప్పటివరకూ కమిన్స్ కెరీర్లో కేవలం ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2011లో నవంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా కమిన్స్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తరువాత అతనికి టెస్టుల్లో చోటు దక్కలేదు. ఒకవేళ ప్రస్తుత భారత్ తో సిరీస్ లో మూడో టెస్టు తుది జట్టులో కమిన్స్ చోటు దక్కితే దాదాపు ఆరేళ్ల తరువాత  ఈ ఫార్మాట్ లో పునరాగమనం చేసిన క్రికెటర్ గా గుర్తింపు పొందుతాడు.


'భారత్ పర్యటన నుంచి మిచెల్  మార్ష్ వైదొలగడం నిజంగా దురదృష్టకరం. ఆ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో కమిన్స్ ను ఎంపిక చేశాం. ఇటీవల కాలంలో వన్డే, ట్వంటీ 20ల్లో కమిన్స్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. మరొకవైపు షెఫల్డ్ షీల్డ్ టోర్నీలో కూడా కమిన్స్ రాణించాడు. వీటిని పరిగణిలోకి తీసుకుని కమిన్స్ ను ఎంపిక చేశాం' అని ఆసీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ట్రెవర్ హాన్స్ తెలిపారు.




 

మరిన్ని వార్తలు