చివరి వన్డే తరువాత స్వదేశానికే..

22 Sep, 2017 15:49 IST|Sakshi

కోల్కతా: ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ప్రధాన పేసర్ గా సేవలందిస్తున్న ప్యాట్ కమిన్స్.. టీమిండియాతో జరిగే మూడు ట్వంటీ 20 సిరీస్ కు దూరం కానున్నాడు. త్వరలో యాషెస్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ కు తగినంత విశ్రాంతి నివ్వాలనేది క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) యోచన. దానిలో భాగంగా టీమిండియాతో టీ 20 సిరీస్ నుంచి అతన్ని తప్పించింది. భారత్ తో నాగ్పూర్ లో జరిగే చివరి వన్డే తరువాత కమిన్స్ స్వదేశానికి పయనం కానున్నట్లు సీఏ వెల్లడించింది.

'మా కీలక బౌలర్ కమిన్స్ కు భారత్ తో జరిగే ట్వంటీ 20 సిరీస్ నుంచి విశ్రాంతినిస్తున్నాం. అతన్ని సాధ్యమైనంత వరకూ గాయపడకుండా చూసుకోవడం మా బాధ్యత. దానిలో భాగంగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని మా సెలక్టర్లు నిర్ణయించారు. కమిన్స్ కు గాయపడలేదు..కానీ అక్టోబర్ లో ఆరంభమయ్యే షెఫల్డ్  ఫీల్డ్ సీజన్ కు  నూతనోత్తేజంతో బరిలోకి దింపాలనే యోచనలో భాగంగానే అతనికి విశ్రాంతి ఇస్తున్నాం. వన్డే సిరీస్ తరువాత కమిన్స్ ఆసీస్ కు వెళతాడు' అని సీఏ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు