బంగ్లా లీగ్‌లో ఆడేందుకు పాక్ క్రికెటర్లకు అనుమతి

2 Nov, 2015 00:33 IST|Sakshi
బంగ్లా లీగ్‌లో ఆడేందుకు పాక్ క్రికెటర్లకు అనుమతి

కరాచీ: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతి ఇచ్చింది. లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్‌తో సహా మొత్తం 25 మంది ఆటగాళ్లు బీపీఎల్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. బీపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లను ఆపాలని తాము కోరుకోవడం లేదని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు కొంత మంది టాప్ ఆటగాళ్లు బంగ్లా క్రికెట్ బోర్డుతో ఒప్పందాలు చేసుకోవడంతో చేసేదేమీలేక పీసీబీ అందరికి అనుమతి ఇచ్చిందని సమాచారం.

‘షకీబ్, తమీమ్‌లాంటి కొంత మంది బంగ్లా స్టార్ ఆటగాళ్లు తమ బోర్డు అనుమతితో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బరిలోకి దిగుతున్నారు. అలాగే బంగ్లాలో ఆడేందుకు ఆస్ట్రేలియా తిరస్కరించడంతో ఇప్పుడు పాక్.. బంగ్లాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ డిసెంబర్‌లో భారత్ ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోతే బంగ్లాతో సిరీస్ ఆడాలని పీసీబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది’ అని సదరు అధికారి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు