అజ్మల్ కు అండగా పీసీబీ!

11 Sep, 2014 15:37 IST|Sakshi
అజ్మల్ కు అండగా పీసీబీ!

కరాచీ:ఐసీసీ నిషేధానికి గురైన పాకిస్తాన్ స్పిన్నర్ సయిద్ అజ్మల్ ను కాపాడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) నడుంబిగించింది.అతడి బౌలింగ్ యాక్షన్ ను సరిదిద్ది మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తీసుకోచ్చేందుకు మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాఖ్ సాయం కోరింది. అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ తాజాగా ఐసీసీ అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో పీసీబీ.. ఆ దేశ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ ను సంప్రదించింది. అజ్మల్ బౌలింగ్ శైలిలో మార్పు తెచ్చి.. తిరిగి అంతర్జాతీయంగా అతన్ని ఆడించాలని పాకిస్తాన్ భావిస్తోంది.

 

'పీసీబీ నన్ను సంప్రదించింది. అజ్మల్ కు సాయం చేయాలని కోరింది. . అజ్మల్ ఒక పోరాట యోధుడు. అతని బౌలింగ్ మళ్లీ సరిదిద్దుకుని ఐసీసీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉందని'  సక్లయిన్ తెలిపాడు. అతని బౌలింగ్ ను సరిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సక్లయిన్ పేర్కొన్నాడు. తొలుత ఐసీసీ నిషేధాన్నిసవాలు చేయాలని భావించిన పాకిస్తాన్.. ఆ నిర్ణయాన్ని మార్చుకుని సక్లయిన్ సాయాన్ని కోరింది. ఒకవేళ ఐసీసీ నిషేధాన్ని సవాల్ చేయాలని పాకిస్తాన్ భావించనప్పటికీ.. ఆ పరీక్షల్లో కూడా అజ్మల్ విఫలమైతే మరిన్ని సమస్యలు రావచ్చని పాకిస్తాన్ ముందుగా అతని బౌలింగ్ సరిచేయడానికి యత్నాలు ఆరంభించింది.
 

>
మరిన్ని వార్తలు