హరికృష్ణ సంచలనం

22 Jan, 2014 01:25 IST|Sakshi

విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సంచలనం సృష్టించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 33 ఎత్తుల్లో గెలుపొందాడు.
 
 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణకిది రెండో విజయం. ప్రస్తుతం హరికృష్ణ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే తొమ్మిదో రౌండ్‌లో నైదిశ్ (జర్మనీ)తో హరికృష్ణ తలపడతాడు.
 

మరిన్ని వార్తలు