రన్నరప్‌ హరికృష్ణ 

28 Apr, 2019 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కెరీర్‌లో తొలి మాస్టర్స్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ గెలిచే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ చేజార్చుకున్నాడు. చైనాలో శనివారం ముగిసిన షెన్‌జాన్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో హరికృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ ఆరు పాయింట్లతో రెండో స్థానంతో సంతృప్తి పడ్డాడు.

నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అనీశ్‌ గిరి 6.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. చివరిదైన పదో రౌండ్‌లో హరికృష్ణ 72 ఎత్తుల్లో లిరెన్‌ డింగ్‌ (చైనా) చేతిలో ఓడిపోగా... అనీశ్‌ గిరి 97 ఎత్తుల్లో జకోవెంకో (రష్యా)పై గెలుపొంది టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. లిరెన్‌ డింగ్‌ (5.5 పాయింట్లు) మూడో స్థానంలో... రాపోర్ట్‌ (హంగేరి–5 పాయింట్లు) నాలుగో స్థానంలో... జకోవెంకో, యాంగి యు (చైనా–

>
మరిన్ని వార్తలు