ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అనీశ్‌ గిరితో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’ 

25 Apr, 2019 00:51 IST|Sakshi

షెన్‌జెన్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో చైనాలో బుధవారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌ను ప్రపంచ 29వ ర్యాంకర్‌ హరికృష్ణ 66 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న  ఈ టోర్నీలో ఏడో రౌండ్‌ తర్వాత హరికృష్ణ ఐదు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 4.5 పాయింట్లతో అనీశ్‌ గిరి రెండో స్థానంలో... 3.5 పాయింట్లతో లిరెన్‌ డింగ్‌ (చైనా) మూడో స్థానంలో ఉన్నారు.    

మరిన్ని వార్తలు