హరికృష్ణ గేమ్ డ్రా

13 Jan, 2014 01:16 IST|Sakshi
హరికృష్ణ గేమ్ డ్రా

విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఆడిన తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో శనివారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... సెర్గీ కర్యాకిన్ (రష్యా)తో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
 
 మొత్తం 12 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. భారత్ నుంచి మాస్టర్స్ విభాగంలో కేవలం హరికృష్ణ మాత్రమే పోటీపడుతున్నాడు. సోమవారం జరిగే మూడో రౌండ్‌లో క్యూబా గ్రాండ్‌మాస్టర్ లీనియర్ డొమింగెజ్‌తో హరికృష్ణ తలపడతాడు.
 

మరిన్ని వార్తలు