ముచ్చటగా మూడోసారి...

14 May, 2018 04:46 IST|Sakshi

ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ స్టార్‌ పెట్రా క్విటోవా డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నీ మాడ్రిడ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో క్విటోవా 7–6 (8/6), 4–6, 6–3తో కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీని మూడుసార్లు గెలిచిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2011, 2015లలో కూడా క్విటోవా ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. విజేత క్విటోవాకు 11,90,490 యూరోల (రూ. 9 కోట్ల 58 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు