పింక్‌ బాల్‌ టెస్ట్‌; బంగ్లా బ్యాటింగ్‌

22 Nov, 2019 12:47 IST|Sakshi

కోల్‌కతా: భారత గడ్డపై తొలిసారిగా పింక్‌ బాల్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ నేడు ప్రారంభమైంది. టీమిండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌ టీమ్‌లో రెండు మార్పులు జరిగాయి. తైజూల్‌, మెహిదీ స్థానంలో ఆల్‌-అమీన్‌, నయీమ్‌ జ​ట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్‌కతా నగరం గులాబీ మయంగా మారింది. పింక్‌ బాల్‌తో తొలిసారిగా మన దేశంలో జరుగుతున్న టె​స్ట్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఈడెన్‌ గార్డెన్స్‌కు అభిమానులు పోటెత్తారు.

కాగా, ఇండోర్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టెస్ట్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పేలవ ప్రదర్శనతో గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన బంగ్లా ఈ మ్యాచ్‌లోనైనా పోరాడి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
(చదవండి: గులాబీ కథ షురూ కావళి)

తుదిజట్లు: 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, జడేజా, సాహా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ  
బంగ్లాదేశ్‌: మోమినుల్‌ (కెప్టెన్‌), కైస్, షాద్‌మన్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, మిథున్, లిటన్‌ దాస్, నయీమ్‌, ముస్తఫిజుర్, అబూ జాయెద్, అల్‌ అమీన్‌ 

మరిన్ని వార్తలు