ఫైనల్లో సాక్షి, బాసుమతారి

13 Apr, 2019 03:45 IST|Sakshi

పింకీరాణి, పర్వీన్‌లకు కాంస్యాలు

కొలోన్‌ బాక్సింగ్‌ ప్రపంచ కప్‌  

న్యూఢిల్లీ: కొలోన్‌ బాక్సింగ్‌ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు సాక్షి, పిలావో బాసుమతారి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. జర్మనీలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ ఆయా వెయిట్‌ కేటగిరీల్లో ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల 57 కేజీల సెమీస్‌ బౌట్‌లో యూత్‌ ప్రపంచ చాంపియన్, 18 ఏళ్ల సాక్షి 5–0తో టిన్‌టథాయ్‌ ప్రీడకమన్‌ (థాయ్‌లాండ్‌)పై అలవోక విజయం సాధించింది. ఫైనల్లో మికేలా వాల్‌‡్ష (ఐర్లాండ్‌)తో సాక్షి అమీతుమీ తేల్చుకోనుంది. 64 కేజీల విభాగంలో బాసుమతారి డెన్మార్క్‌కు చెందిన ఐజా డిట్టే ప్రోస్తోమ్‌పై నెగ్గింది. ఫైనల్లో చైనాకు చెందిన చెంగ్యూ యాంగ్‌తో బాసుమతారి తలపడుతుంది. మరోవైపు 51 కేజీల విభాగంలో పింకీ రాణి, 60 కేజీల విభాగంలో పర్వీన్‌ సెమీస్‌లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నార

>
మరిన్ని వార్తలు