పిస్టోరియస్ ను మళ్లీ దోషిగా తేల్చారు..

3 Dec, 2015 15:13 IST|Sakshi
పిస్టోరియస్ ను మళ్లీ దోషిగా తేల్చారు..

బ్లొమ్ఫోంటిన్ : గర్ల్ ఫ్రెండ్ను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ను దోషిగా దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తేల్చింది. పిస్టోరియస్కు సంబంధించిన కేసుపై వచ్చిన అప్పీల్పై అక్కడి సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ జరిపింది. అయితే గతంలో ఇచ్చిన తీర్పు చాలా తక్కువ తీవ్రత కలిగి ఉండటంతో ఈ కేసుపై పరిస్థితులు మరింత కఠినతరం అయ్యాయి. హౌస్ అరెస్ట్ కింద శిక్ష కాలాన్ని పూర్తి చేయడానికి స్థానిక కోర్టు తీర్పు ఇవ్వడంతో నిందితుడికి తగిన శిక్ష విధించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన విషయం అందరికీ విదితమే.

దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు గతంలో ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఉద్దేశపూర్వకంగా దుర్బుద్ధితోనే గర్ల్ ఫ్రెండ్ను హత్యచేశాడని జడ్జి జస్టీస్ ఎరిక్ లీచ్ మీడియాకు తెలిపారు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం పిస్టోరియస్ను దోషిగా తేల్చుతూ తగిన శిక్ష విధించాలని ట్రయల్ కోర్టుకు కేసును తిప్పిపంపింది. 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు