ఫిక్సింగ్ కు పాల్పడితే కఠిన చర్యలే...

5 Apr, 2015 10:44 IST|Sakshi
ఫిక్సింగ్ కు పాల్పడితే కఠిన చర్యలే...

అహ్మదాబాద్ : మరో 3 రోజుల్లో ఐపీల్-8 ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ టీమ్ పర్యవేక్షకుడు రాహుల్ ద్రవిడ్ ఫిక్సింగ్ అంశంపై వ్యాఖ్యానించాడు. ఐపీఎల్-2013 లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాల వంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా టీమ్ ఫ్రాంచైజీలు జాగ్రత్త పడాలని 'ది వాల్' గా ప్రఖ్యాతి గాంచిన ద్రవిడ్ శనివారం అన్నారు.

ఐపీఎల్ అవినీతి నిరోధక, భద్రత విభాగం (ఎసీఎస్యూ) నిబంధనలను కచ్చితంగా పాటిస్తామన్నాడు. ఫిక్సింగ్ కు పాల్పడితే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. గతంలో జరిగిన కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పటిష్ట చర్యలు తీసుకుంటామని మోతెరాలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ద్రవిడ్ పేర్కొన్నారు. ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయిన ముగ్గురు ఆటగాళ్లలో భారత జట్టు తరపున ఆడిన శ్రీశాంత్ ఒకడు. దీంతో బీసీసీఐ శ్రీశాంత్ పై జీవితకాల నిషేధం విధించిన సంగతి అందరికి తెలిసిందే.

మరిన్ని వార్తలు