ఆటగాళ్లను గవర్నర్లను చేయాలి: మిల్కా సింగ్

23 Nov, 2013 21:51 IST|Sakshi

నొయిడా:దేశంలో చాలామంది క్రీడాకారులకు మంచి విజ్ఞానం ఉంది. వారిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా లేక రాయబారులుగా నియమించాలి. రాజకీయ నాయకులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఈ పదవులకు ఎంపిక అవుతున్నప్పుడు ఆటగాళ్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ ప్రశ్నించాడు ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం అందుకునే అర్హత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఉందని తెలిపాడు. దేశంలోని యువతకు అతడు మార్గదర్శకుడని కొనియాడారు. ఓ క్రికెటర్‌గా విజయవంతమవడమే కాకుండా తన ప్రవర్తనతో కూడా తోటి ఆటగాళ్లకన్నా ముందున్నాడన్నారు.

 

అయితే తనకన్నా ముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కు ఈ ఘనత దక్కితే బాగుండేదని అన్నారు.  మొత్తానికి ఈ అవార్డును క్రీడాకారులకు కూడా ఇవ్వనుండడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. సచిన్ వినయం అపూర్వం: చాన్నాళ్లుగా సచిన్ ఆదర్శప్రాయుడిగా ఉంటున్నాడు. చాలాసార్లు నేను అతడిని కలుసుకున్నాను. ఎప్పుడు కలిసినా నా పాదాలకు నమస్కరిస్తాడు. అతడి ప్రవర్తనకు ముగ్ధుడయ్యే వాడిని. క్రికెటర్‌గా ఎంతో పేరున్నా చాలా అణుకువగా ఉంటాడు. తన విజయాలను నెత్తికెక్కించుకోని ఆటగాడని మిల్కాసింగ్ తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు