ప్రపంచ కప్: పొలార్డ్, బ్రావో అవుట్

11 Jan, 2015 15:25 IST|Sakshi

సెయింట్ జాన్స్: వన్డే ప్రపంచ కప్లో పొల్గొనే వెస్టిండీస్ క్రికెట్ జట్టులో సీనియర్లు డ్వెన్ బ్రావో, కీరన్ పొలార్డ్లకు చోటు దక్కలేదు. విండీస్ సెలక్టర్లు సీనియర్లయిన వీరిద్దరినీ పక్కనబెట్టడం వివాదాస్పదమైంది.

ప్రపంచ కప్నకు 15 మందితో కూడిన విండీస్ జట్టును ఆదివారం ప్రకటించారు. జాసన్ హోల్డర్, మార్టోన్ శామ్యూల్స్ను కెప్టెన్, వైఎస్ కెప్టెన్గా నియమించారు. ఈ మెగా ఈవెంట్కు తాము అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని విండీస్ చీఫ్ సెలెక్టర్ క్లయివ్ లాయిడ్ అన్నాడు. జీతాల విషయంలో బ్రావో, పొలార్డ్.. విండీస్ బోర్డుల మధ్య గతంలో వివాదం ఏర్పడటం, ఇటీవల వీరిద్దరూ వన్డేల్లో అంతగా రాణించకపోవడంతో పక్కనబెట్టినట్టు భావిస్తున్నారు.  వచ్చే నెల 14 నుంచి జరిగే ప్రపంచ కప్నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

విండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), మార్లోన్ శామ్యల్స్ (వైఎస్ కెప్టెన్), బెన్, డారెన్ బ్రావో, కార్టెర్, కాట్రెల్, క్రిస్టోఫర్ గేల్, సునీల్ నరైన్, రాందిన్, రోచ్, రసెల్, సమీ, సిమన్స్, డ్వెన్ స్మిత్, జెరోమీ టేలర్,

మరిన్ని వార్తలు