టీమిండియాతో సిరీస్‌కు విండీస్‌ జట్టు ఇదే..

29 Nov, 2019 12:09 IST|Sakshi

ఆంటిగ్వా:  టీమిండియాతో ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించి వెస్టిండీస్‌ జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు భారత్‌తో సిరీస్‌కు జట్టును విండీస్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు ఫార్మాట్లకు కీరోన్‌ పొలార్డ్‌నే సారథిగా నియమిస్తూ సదరు బోర్దు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌లో భాగంగా భారత్‌లో ఉన్న విండీస్‌ ఆటగాళ్లనే దాదాపు ఎంపిక చేసింది.

‘ప్రతీ ఫార్మాట్‌లో మూడేసి మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో తలో జట్టును ఎంపిక చేశాం. భారత్‌తో సిరీస్‌ కఠినతరంగా ఉంటుంది.  తమ జట్టు భారత్‌లో విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. భారత్‌తో మరింత పోటీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాం’ హెడ్‌ కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ తెలిపారు.డిసెంబర్‌ 6వ తేదీన హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్‌తో విండీస్‌ పర్యటన షురూ కానుంది. డిసెంబర్‌ 22వ తేదీన కటక్‌లో చివరి వన్డే  జరుగనుంది.

విండీస్‌ టీ20 జట్టు: కీరోన్‌ పొలార్డ్‌(కెప్టెన్‌), ఫాబియన్‌ అలెన్‌, షెల్డాన్‌ కాట్రెల్‌, షిమ్రాన్‌ హెట్‌ మెయిర్‌, జాసన్‌ హోల్డర్‌, బ్రాండాన్‌ కింగ్‌, ఎవిన్‌ లూయిస్‌, కీమో పాల్‌, నికోలస్‌ పూరన్‌, కారీ పీర్రె, దినేశ్‌ రామ్‌దిన్‌, రూథర్‌ఫర్డ్‌, లెండిల్‌ సిమ్మన్స్‌, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌, కెస్ట్రిక్‌ విలియమ్స్‌

వన్డే జట్టు: కీరోన్‌ పొలార్డ్‌(కెప్టెన్‌), షాయ్‌ హోప్‌, సునీల్‌ ఆంబ్రిస్‌, రోస్టన్‌ ఛేజ్‌, షెల్డాన్‌ కాట్రెల్‌, షిమ్రాన్‌ హెట్‌ మెయిర్‌, జాసన్‌ హోల్డర్‌, అల్జారీ జోసెఫ్‌, బ్రాండాన్‌ కింగ్‌, ఎవిన్‌ లూయిస్‌, కీమో పాల్‌, కారీ పీర్రె, నికోలస్‌ పూరన్‌, రొమారియా షెఫర్డ్‌, హెడెన్‌ వాల్స్‌ జూనియర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా