ఆసీస్‌ టెస్టు జట్టులో ఫించ్‌ 

12 Sep, 2018 01:22 IST|Sakshi

సిడ్నీ: డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌   తొలిసారిగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. టిమ్‌ పైన్‌ నేతృత్వంలోని ఆసీస్‌ జట్టు వచ్చే నెలలో పాకిస్తాన్‌తో రెండు టెస్టులాడనుంది. అక్టోబర్‌ 7 నుంచి దుబాయ్‌లో తొలి టెస్టు, 16 నుంచి అబు దాబిలో రెండో టెస్టు జరుగనుంది. ఇప్పటికే ఆసీస్‌ తరఫున 93 వన్డేలు, 42 టి20లు ఆడిన ఫించ్‌తోపాటు ఏకంగా ఐదుగురికి టెస్టుల్లో అరంగేట్రం అవకాశమిచ్చారు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సెలక్టర్లు.

ఇందులో ట్రెవిస్‌ హెడ్‌ కూడా ఉండగా, మిగతా ముగ్గురైతే పూర్తిగా కొత్త ముఖాలే. క్వీన్స్‌లాండ్‌కు చెందిన మైకేల్‌ నాసెర్, బ్రెండన్‌ డగెట్, మార్నస్‌ లబ్‌షేన్‌లు తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. కీలక ఆటగాళ్లంతా దూరం కావడంతో ఏకంగా ఐదుగురిని కొత్తగా టెస్టు జట్టులోకి తీసుకున్నామని సీఏ సెలక్టర్‌ ట్రెవర్‌ హాన్స్‌ తెలిపారు. దక్షిణాఫ్రికాలో బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో అప్పటి కెప్టెన్‌ స్మిత్, ఓపెనర్లు వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లతో పాటు హజెల్‌వుడ్, కమిన్స్‌ గాయాలతో ఆటకు దూరమైన నేపథ్యంలో సగం జట్టు సభ్యులను కొత్తగా చేర్చాల్సి వచ్చింది.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హార్దిక్‌ పాండ్యా ఔట్‌ 

సిక్కి, శ్రీనివాసరావులకు వైఎస్‌ జగన్‌ అభినందన

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

ఆంధ్ర మరో విజయం

‘సినిమా ఇంకా ఉంది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధనుష్‌ దర్శకత్వంలో 'అనూ'

త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..!

ఏ హీరోతో అయినా నటిస్తాను..

పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్‌

మలేసియాలో మస్త్‌ మజా

నేను అనుకున్నవన్నీ జరుగుతాయి