క్వార్టర్స్‌లో పూజ, జతిన్‌దేవ్‌ గెలుపు

4 Oct, 2019 10:09 IST|Sakshi

స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సబ్‌ జూనియర్‌ బాలికల విభాగంలో పూజ (ఏడబ్ల్యూఏ), క్యాడెట్‌ బాలుర విభాగంలో జతిన్‌దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఏడబ్ల్యూఏ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా గురువా రం జరిగిన సబ్‌ జూనియర్‌ బాలికల క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో పూజ 3–2తో అనన్య డోనెకల్‌ (జీఎస్‌ఎం)పై గెలుపొందగా, పలక్‌ 3–0తో హెచ్‌ఎస్‌ నిఖిత (వీపీజీ)ని ఓడించింది. కావ్య (ఏడబ్ల్యూఏ) 3–0తో నందిని (వీపీజీ)పై, మెర్సీ (హెచ్‌వీఎస్‌) 3–2తో అఫీఫా ఫాతిమాపై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టారు.

క్యాడెట్‌ బాలుర క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో జతిన్‌దేవ్‌ 3–0తో తరుణ్‌ ముకేశ్‌ (ఆర్‌టీటీఏ)పై, ధ్రువ్‌ సాగర్‌ (జీఎస్‌ఎం) 3–1తో తరుణ్‌ (జీఎస్‌ఎం)పై, ఆరుశ్‌ (ఏపీజీ) 3–0తో అక్షయ్‌ (ఏడబ్ల్యూఏ)పై, చిరంథన్‌ 3–1తో శ్రీహాన్‌ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. క్యాడె ట్‌ బాలికల క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో శ్రేయ 3–1తో వత్సల (హెచ్‌పీఎస్‌)పై, ప్రజ్ఞాన్ష 3–0తో తేజస్విని (ఏడబ్ల్యూఏ)పై, శ్రీయ 3–0తో శరణ్య (హెచ్‌పీఎస్‌)పై, జలాని 3–1తో శ్రేష్టా(జీఎస్‌ఎం)పై నెగ్గారు.  
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

యూత్‌ బాలికల క్వార్టర్స్‌: రాగ నివేదిత  4–2తో సృష్టిపై, వినిచిత్ర (జీఎస్‌ఎం) 4–2తో భవిత (జీఎస్‌ఎం)పై, ప్రణీత (హెచ్‌వీఎస్‌) 4–0తో కీర్తన పై, వరుణి (జీఎస్‌ఎం) 4–0తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందారు.  

పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌: లోహిత్‌ (ఏడబ్ల్యూఏ) 4–3తో దీపేశ్‌పై, సౌరభ్‌ 4–1తో మహేందర్‌పై, విశాల్‌ 4–1తో వివేక్‌పై, సాయి తేజేశ్‌ (ఏడబ్ల్యూఏ) 4–0తో ప్రజ్వల్‌ (హెచ్‌వీఎస్‌)పై, రాజు (ఏడబ్ల్యూఏ) 4–3తో శశి కిరణ్‌ (ఎంఎల్‌ఆర్‌)పై, వత్సిన్‌ 4–0తో దీపక్‌పై గెలిచారు.   

మరిన్ని వార్తలు