తొలి మహిళా క్రికెటర్‌గా..

12 Mar, 2018 21:33 IST|Sakshi

వడోదరా: పేటీఎం వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్‌ పూజా వస్త్రాకర్ అరుదైన రికార్డును సాధించారు. ఆసీస్‌తో వన్డేలో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన పూజా..తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి అర్థ శతకం సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించారు. ఇప్పటివరకూ న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ దూలాన్‌ పేరిట ఉన్న రికార్డును పూజా వస్త్రాకర్‌ సవరించారు. 2009లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దులాన్‌ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసి 48 పరుగులు సాధించారు.

దాన్ని ఇప్పుడు వస్త్రాకర్‌ బ్రేక్‌ చేసి కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇది వస్త్రాకర్‌కు తొలి వన్డే హాఫ్‌ సెంచరీ. ఈ క్రమంలోనే తొలి వన్డే హాఫ్‌ సెంచరీ చేసిన పిన్న వయసు భారత క్రీడాకారిణులు జాబితాలో వస్త్రాకర్‌ నాల్గో స్థానంలో నిలిచారు. 18 ఏళ్ల 168 రోజుల వయసులో వస్త్రాకర్‌ ఈ ఘనత సాధించారు. అంతకుముందు వరుసలో తిరుషా కామిని, మిథాలీ రాజ్‌, స్మృతీ మంధానాలు ఉన్నారు.

మరిన్ని వార్తలు