విజేత ప్రజ్ఞానంద

8 Dec, 2019 01:12 IST|Sakshi

లండన్‌ క్లాసిక్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ

చెన్నై: భారత చెస్‌ వండర్‌కిడ్‌ ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల ఈ కుర్రాడు ప్రతిష్టాత్మక లండన్‌ క్లాసిక్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించాడు. నిరీ్ణత తొమ్మిది రౌండ్ల తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద, ఆంటోన్‌ స్మిర్నోవ్‌ (ఆ్రస్టేలియా) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా ప్రజ్ఞానందకు టాప్‌ ర్యాంక్‌ ఖాయమైంది.

భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం 7 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. ఈ ఏడాది ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌–18 విభాగంలో విజేతగా నిలిచిన ప్రజ్ఞానంద లండన్‌ క్లాసిక్‌ టోర్నీలో అజేయంగా నిలిచాడు. ఆరు గేముల్లో గెలిచిన అతను, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఎచ్‌ సిల్వయిన్, బ్రోజెల్‌ సాచా, రిచర్డ్‌ బేట్స్, రేమండ్‌ సాంగ్, మారి్టన్‌ పెట్రోవ్, జూల్స్‌ ముసార్డ్‌లపై నెగ్గిన ప్రజ్ఞానంద... ఆంటోన్‌ స్మిర్నోవ్, అరవింద్‌ చిదంబరం, సహజ్‌ గ్రోవర్‌లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు