ఓజా యాక్షన్ క్లియర్

6 Feb, 2015 00:26 IST|Sakshi

రంజీ మ్యాచ్ ఆడనున్న స్పిన్నర్
 న్యూఢిల్లీ: లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు ఊరట లభించింది. సందేహాస్పద యాక్షన్‌తో నిషేధానికి గురైన ఈ హైదరాబాద్ బౌలర్ తన బౌలింగ్‌ను సరిదిద్దుకున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్‌ను సరైనదిగా నిర్ధారిస్తూ తాజాగా బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చింది.
 
 దాంతో అతను శుక్రవారంనుంచి ఉప్పల్‌లో హిమాచల్‌ప్రదేశ్‌తో  జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ‘అవును, నా యాక్షన్‌ను సరైనదిగా గుర్తిస్తూ బీసీసీఐ మెయిల్ పంపించింది. ఇకపై నేను పోటీ క్రికెట్ బరిలోకి దిగవచ్చు. ఇన్నాళ్ల నా వేదన తీరింది. ఇక ఈ అంకం ముగిసినట్లే’ అని ఓజా చెప్పాడు.
 

మరిన్ని వార్తలు