కెరీర్‌ ఉత్తమ ర్యాంక్‌కు ప్రజ్నేశ్‌

29 Jan, 2019 01:51 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు మెరుగు పర్చుకున్నాడు. ఫలితంగా తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ 102కు చేరుకున్నాడు. ప్రజ్నేశ్‌ ఇటీవలే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలిసారి మెయిన్‌ ‘డ్రా’లో ఆడాడు. పురుషుల విభాగంలో రామ్‌కుమార్‌ రామనాథన్‌ 133వ స్థానంలో నిలవగా, 13 స్థానాలు దిగజారిన యూకీ బాంబ్రీ 151వ ర్యాంక్‌లో నిలిచాడు. టాప్‌–200లో భారత్‌ తరఫు నుంచి ఈ ముగ్గురు ఉన్నారు. డబుల్స్‌ విభాగంలో మూడేసి స్థానాలు దిగజారి రోహన్‌ బోపన్న (37), దివిజ్‌ శరణ్‌ (40), జీవన్‌ నెడుంజెళియన్‌ (76)వ ర్యాంకుల్లో నిలవగా... లియాండర్‌ పేసర్‌ 78వ స్థానానికి పడిపోయాడు.  

అంకిత కెరీర్‌ బెస్ట్‌... 
సింగపూర్‌లో జరిగిన ఐటీఎఫ్‌ టోర్నీలో విజేతగా నిలిచిన అంకిత రైనా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో భారీ పురోగతి సాధించింది. ఏకంగా 35 స్థానాలు మెరుగుపర్చుకున్న అంకిత 168వ స్థానంలో నిలిచింది. ఆమె తర్వాత భారత్‌ నుంచి కర్మన్‌ కౌర్‌ తాండి (210)దే అత్యుత్తమ ర్యాంక్‌ కాగా... హైదరాబాద్‌ అమ్మాయి ప్రాంజల యడ్లపల్లి (290) టాప్‌–300లో నిలిచింది.  

మరిన్ని వార్తలు