రన్నరప్‌ ప్రజ్నేశ్‌ 

22 Apr, 2019 02:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు నిరాశ ఎదురైంది. చైనాలో ఆదివారం ముగిసిన కున్‌మింగ్‌ ఓపెన్‌ టోర్నీలో ప్రజ్నేశ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 4–6, 3–6తో ప్రపంచ 211వ ర్యాంకర్‌ జే క్లార్క్‌ (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచిన ప్రజ్నేశ్‌కు 12,720 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 83 వేలు)తోపాటు 75 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. తాజా ప్రదర్శనతో ప్రజ్నేశ్‌ తన వ్యక్తిగత ర్యాంకింగ్‌ ఆధారంగా... జూన్, జూలైలలో జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగాల్లో నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో అవకాశాన్ని సంపాదించాడు.    

>
మరిన్ని వార్తలు