ప్రజ్నేశ్‌ పరాజయం 

26 Feb, 2020 04:27 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఏడాది బరిలోకి దిగిన ఐదో టోర్నమెంట్‌లోనూ భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు నిరాశ ఎదురైంది. దుబాయ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నమెంట్‌లో చెన్నైకి చెందిన 30 ఏళ్ల ప్రజ్నేశ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ప్రపంచ 96వ ర్యాంకర్‌ డెన్నిస్‌ నొవాక్‌ (ఆస్ట్రియా)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 134వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 4–6, 3–6తో ఓడిపోయాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు.

క్వార్టర్‌ ఫైనల్లో పేస్‌ జంట 
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో పేస్‌–ఎబ్డెన్‌ ద్వయం 6–4, 6–3తో ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)–ఫిలిప్‌ పొలాసెక్‌ (స్లొవేకియా) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో హెన్రీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)–జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ) జంటతో పేస్‌–ఎబ్డెన్‌ ద్వయం ఆడుతుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా