డీబీఏపై విమర్శలు తగవు: మహ్మద్ అజహరుద్దీన్

30 Jul, 2013 03:46 IST|Sakshi
ప్రకాశ్ పదుకొణే సరైన వ్యక్తి : మహ్మద్ అజహరుద్దీన్

పసలేని ఆరోపణలతోనే తమ సంఘం గుర్తింపు రద్దు చేశారని ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం (డీబీఏ) నూతన అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ‘బాయ్’పై ధ్వజమెత్తారు. సమాఖ్య రాజకీయాల కారణంగా ఆటగాళ్లు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చే శారు. ‘డీబీఏ క్రియాశీలంగా లేదనే హక్కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు లేదు. ఇవన్నీ కుంటిసాకులు మాత్రమే. మా కార్యకలాపాల గురించి బాయ్‌కు వివరించడంతో పాటు అన్ని నిబంధనలను అమలుపరిచాం. వారి చర్య స్పోర్ట్స్ చార్టర్‌కు వ్యతిరేకం. మాకు వారు ఎలాంటి నోటీస్ పంపలేదు. డీబీఏ వాదనలు కూడా వినలేదు. నిజంగా ఇది అన్యాయం. మాకు తిరిగి గుర్తింపునివ్వాలి’ అని అజ్జూ అన్నారు. ఏప్రిల్ 27న జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఢిల్లీ క్యాపిటల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (డీసీబీఏ)కు బాయ్ గుర్తింపునిచ్చింది. అప్పటి నుంచీ డీబీఏ న్యాయపోరాటాన్ని సాగిస్తోంది.
 
 భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌ను నిర్వహించేందుకు దిగ్గజ షట్లర్ ప్రకాశ్ పదుకొణే సరైన వ్యక్తి అని అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. పరిపాలనలో ఆటగాళ్లను దూరంగా ఉంచడం చాలా ఏళ్ల నుంచి జరుగుతున్నదేనని అన్నాడు. లేకుండా ఈపాటికి పడుకొనే బాయ్ చీఫ్‌గా ఉండేవారని చెప్పారు. ఆటగాళ్ల గురించి మరో ఆటగాడికు తెలుస్తుందని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు