ప్రకాశ్‌ పడుకోన్‌కు జీవిత సాఫల్య పురస్కారం

12 Sep, 2017 00:43 IST|Sakshi
ప్రకాశ్‌ పడుకోన్‌కు జీవిత సాఫల్య పురస్కారం

కొచ్చి: భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పడుకోన్‌ ‘బాయ్‌’ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఈ ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డుకు శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి. బాయ్‌ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తాం. బ్యాడ్మింటన్‌లో విశేష సేవలందించిన వారికి ప్రతీ ఏడాది ఈ అవార్డు ఇస్తాం.

బెంగళూరులో జరిగిన గత ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాం. తొలి అవార్డును పడుకోన్‌కు ఇవ్వాలని  కోర్‌ కమిటీ ప్రతిపాదించింది’ అని అన్నారు. 1980లో ప్రకాశ్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించారు. 1983లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 1978 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచారు. కేంద్ర ప్రభు త్వం ద్వారా 1972లో ‘అర్జున’, 1982లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు అందుకున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు