ప్రణవ్, సత్యలకు స్వర్ణాలు 

12 Mar, 2020 14:24 IST|Sakshi

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: టాటా గ్లోబల్‌ బెవరేజెస్, భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ‘చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌’ టోర్నమెంట్‌లో కె. ప్రణవ్, పి. సత్య సత్తా చాటారు. గచ్చిబౌలి అథ్లెటిక్స్‌ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ టోర్నీ లాంగ్‌ జంప్‌ ఈవెంట్‌లో వీరిద్దరూ విజేతలుగా నిలిచి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో కె. ప్రణయ్‌ విజేతగా నిలవగా... జి. పరశురామ్, పి. వినోద్‌ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో సత్య, సవిత, గాయత్రి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్‌–16 కేటగిరీలో జరిగిన  ఈ టోర్నీలో లాంగ్‌జంప్‌తో పాటు 100మీ. పరుగు, 400మీ. పరుగు, 800మీ. పరుగు, షాట్‌పుట్‌ ఈవెంట్‌లలో పోటీలను నిర్వహించారు. ప్రతీ పోటీలోనూ విజేతగా నిలిచిన వారు ఆలిండియా ఫైనల్స్‌ అథ్లెటిక్స్‌ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఆలిండియా ఫైనల్స్‌లోనూ సత్తా చాటిన వారు ప్రపంచ ఫైనల్స్‌కు అర్హత పొందుతారు.  
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు 
100మీ.పరుగు 
బాలురు: 1. టి. అంజి కుమార్, 2. వి. దుర్గా సాయి గణేశ్, 3. డి. దీపక్‌; బాలికలు: 1. ఎం. శ్రుతి, 2. ఎం. మనీషా, 3. టి. శ్రీ తేజ. 
400మీ. పరుగు 
బాలురు: 1. సీహెచ్‌ రాజు, 2. ఎస్‌. యుగేందర్, 3. లక్ష్మణ్‌ నాయక్‌; బాలికలు: 1. ఎల్‌. కీర్తన, 2. డి. సాయి సంగీత, 3. ఎల్‌. వాణి. 
800మీ. పరుగు 
బాలురు: 1. బి. నరేశ్, 2. ఎం. గంగా వరప్రసాద్, 3. ఎం. ఈశ్వర్‌; బాలికలు: 1. ఎం. మల్లిక, 2. సీహెచ్‌. కీర్తన, 3. సీహెచ్‌ జ్యోతి. 
షాట్‌పుట్‌ 
బాలురు: 1. కె. అనిల్, 2. శ్రీధర్, 3. విష్ణు; బాలికలు: 1. కె. రాజేశ్వరి, 2. ఎం. రమ్యశ్రీ, 3. ఎన్‌. భువనేశ్వరి.   

మరిన్ని వార్తలు