చైనా ఓపెన్‌ నుంచి రిక్త హస్తాలతో..

20 Sep, 2019 16:22 IST|Sakshi

చాంగ్‌జౌ: చైనా ఓపెన్‌ వరల్డ్‌టూర్‌ సూపర్‌-1000 టోర్నీలో భారత షట్లర్‌ సాయి ప‍్రణీత్‌ ఇంటి దారి పట్టాడు. . శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ కార్టర్‌ ఫైనల్లో సాయి ప్రణీత్‌ 21-16, 6-21, 16-21 తేడాతో ఆంటోని సినిసుకా గింటిక్‌(ఇండోనేసియా) చేతలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సాయి ప్రణీత్‌.. మిగతా రెండు గేమ్‌ల్లో తేలిపోయాడు. రెండో గేమ్‌ను దారుణంగా కోల్పోయిన ప్రణీత్‌.. మూడో గేమ్‌లో పుంజు కోవడానిక యత్నించినా ఆంటోని ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.

వరుస పాయింట్లు సాధిస్తూ ప్రణీత్‌పై ఒత్తిడి పెంచాడు. ప్రధానంగా రెండో గేమ్‌లో ఆంటోని వరుస ఆరు పాయింట్లు సాధించడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ క‍్రమంలోనే గేమ్‌ను కోల్పోయాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆంటోని ఆరంభంలోనే పైచేయి సాధించాడు. ప్రణీత్‌ను 2-6తో వెనక్కి నెట్టిన ఆంటోని.. అదే జోరును కడవరకూ కొనసాగించాడు. దాంతో ప్రణీత్‌కు పరాజయం తప్పలేదు. దాంతో చైనా ఓపెన్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. కనీసం ఒక్క పతకం కూడా సాధించకుండానే భారత ఆటగాళ్ల రిక్త హస్తాలతో వెనుదిరిగారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ. 1.25 కోట్లు : సానియా మీర్జా

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!

కోబీ బ్రయాంట్‌ టవల్‌కు రూ. 24 లక్షలు

జూన్‌ 30 వరకు టోర్నీలు రద్దు 

సినిమా

బ‌న్నీ డ్యాన్స్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుమానం

రణ్‌బీర్‌ మా ఇంటికొచ్చి ఆఫర్‌ ఇచ్చాడు

పలు సంస్థలకు గ్లోబల్‌ జంట విరాళాలు

స‌న్నీలియోన్ డ్యాన్స్‌కు పిల్ల‌ల కేరింత‌లు

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!