భారత టీటీ జట్టులో ప్రణీత

15 Mar, 2019 10:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి గార్లపాటి ప్రణీత గొప్ప అవకాశాన్ని అందుకుంది. ఒమన్‌ ఓపెన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు ఆమె ఎంపికైంది. యూత్‌ బాలికలు, మహిళల విభాగాల్లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నెల 20 నుంచి 24 వరకు మస్కట్‌లో ఒమన్‌ ఓపెన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ టీటీ టోర్నీ జరుగుతుంది.

జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు కైవసం చేసుకుంటోన్న ప్రణీత స్థానిక హనుమాన్‌ వ్యాయామశాల టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఆమె భారత జట్టుకు ఎంపికవడం పట్ల తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రణీత కేఎంఐటీ ఇంజనీరింగ్‌ కాలేజిలో చదువుతోంది.  

మరిన్ని వార్తలు