ప్రిక్వార్టర్స్ కు కశ్యప్, ప్రణయ్

2 Aug, 2017 15:35 IST|Sakshi
ప్రిక్వార్టర్స్ కు కశ్యప్, ప్రణయ్

ఆక్లాండ్:న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సౌరవ్ వర్మ, సిరిల్ వర్మలు ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన రెండో రౌండ్ పోరులో వారు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరారు. 

 

తొలుత ప్రణయ్ 23-21, 21-18 తేడాతో అబ్దుల్లా కౌలిక్(ఇండోనేసియా)పై పోరాడి గెలిచి తదుపరి రౌండ్ కు అర్హత సాధించగా, కశ్యప్ 21-9, 21-8 తేడాతో ఒస్కార్ గు(న్యూజిలాండ్)పై సునాయాసంగా విజయం సాధించి ప్రిక్వార్టర్స్  కు చేరాడు. ఇక సౌరవ్ 21-16, 21-16 తో ఖో విబోవు(ఇండోనేసియా)పై, సిరిల్ వర్మ 21-14, 21-16తో  విక్కీ అంగ్గా(ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు.

మరిన్ని వార్తలు