హైజంప్‌లో ప్రణయ్‌కు స్వర్ణం

15 Sep, 2019 09:57 IST|Sakshi

సౌత్‌ జోన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ తొలిరోజు తెలంగాణ అథ్లెట్లు పతకాల పంట పండించారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో జరుగుతోన్న ఈ టోర్నీలో మొత్తం 16 పతకాలను సాధించారు. ఇందులో 3 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. అండర్‌–14 బాలుర హై జంప్‌లో కె. ప్రణయ్‌ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. అతను అందరికన్నా ఎక్కువగా 1.75మీ. జంప్‌ చేసి విజేతగా నిలిచాడు. 100మీ. పరుగులో గౌతమ్‌  11.8సెకన్లలో లక్ష్యాన్ని చేరి బంగారు పతకాన్ని అందుకున్నాడు. అండర్‌–18 బాలికల 100మీ. పరుగులో దీప్తి జీవంజి 12.11సెకన్లలో పరుగును పూర్తిచేసి చాంపియన్‌గా నిలిచింది.

అండర్‌–14 బాలుర 100మీ. పరుగులో హర్ష  (11.81సె.), అండర్‌–18 బాలికల 100మీ. పరుగులో కియాషా (12.41సె.), అండర్‌–16 బాలికల 400మీ. పరుగులో మైథిలీ (58.79సె.), బాలుర విభాగంలో మహేశ్‌ (50.28సె.), అండర్‌–20 బాలికల 1500మీ. పరుగులో మహేశ్వరి (4ని.42.00సె.), అండర్‌–16 బాలుర 2000మీ. పరుగులో యరమాకల రెడ్డి (5ని.57.13సె.), అండర్‌–18 బాలికల 100మీ. హర్డిల్స్‌లో నందిని (15.19సె.) రన్నరప్‌లుగా నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్‌–16 బాలుర 100మీ. పరుగులో దిలీప్‌ (11.53సె.), అండర్‌–18 బాలికల 100మీ. హర్డిల్స్‌లో శ్రీ పద్మ (15.34సె.), అండర్‌–20 బాలుర షాట్‌పుట్‌లో సత్యవాన్‌ (15.94మీ.) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

>
మరిన్ని వార్తలు