వెంకటేశ్ ప్రసాద్ కు కీలక పదవి?

14 Nov, 2017 16:20 IST|Sakshi

ముంబై:టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కు కీలక పదవి దక్కే అవకాశం కనబడుతోంది. బీసీసీఐ జనరల్ మేనేజర్(క్రికెట్ ఆపరేషన్స్) పదవి వెంకటేశ్ ప్రసాద్ ను వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు నవంబర్ 2 వ తేదీన జరిగిన ఇంటర్య్యూకు హాజరైన వెంకటేశ్ ప్రసాద్.. ఈ పదవిని పొందేందుకు అందరికంటే ముందువరుసలో ఉన్నారు. దాంతో వెంకటేశ్ ప్రసాద్ కు జీఎం పదవి దాదాపు ఖాయంగానే కనబడుతోంది.

ఆ పదవిని పొందేందకు వెంకటేశ్ ప్రసాద్ కు అన్ని అర్హతలున్నాయంటూ బీసీసీఐకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం కూడా అందుకు  బలాన్నిస్తోంది. టీమిండియా తరఫున 33 టెస్టులాడిన ఆయన 96 వికెట్లు, 161 వన్డేల్లో 196 వికెట్లు తీశారు.  టెస్టుల్లో అతని అత్యుత్తమం 6/33 కాగా, వన్డేల్లో ఉత్తమ ప్రదర్శన 5/27. ఇటీవల కన్నుమూసిన హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్‌  పరస్పర విరుద్ధ ప్రయోజనల నిబంధన వల్ల బీసీసీఐ జీఎం పదవికి రాజీనామా చేశారు.  ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న జీఎం పదవికి బీసీసీఐ ఇంటర్య్యూలు నిర్వహించింది. 

మరిన్ని వార్తలు