ప్రవీణ్‌ కుమార్‌ వీడ్కోలు 

21 Oct, 2018 00:56 IST|Sakshi

లక్నో: భారత పేస్‌ బౌలర్‌ ప్రవీణ్‌ కుమార్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల ఈ వెటరన్‌ పేసర్‌ 2007లో పాకిస్తాన్‌తో జైపూర్‌లో జరిగిన వన్డేతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2012 వరకు సాగిన ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 68 వన్డేలాడి 77 వికెట్లు పడగొట్టాడు. 10 టి20ల్లో 8, 6 టెస్టులాడి 27 వికెట్లు తీశాడు.

ప్రవీణ్‌ అద్భుత ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాలో 2008లో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ ‘కామన్వెల్త్‌ బ్యాంక్‌ ట్రోఫీ’ని భారత్‌ చేజిక్కించుకుంది. ‘నా కెరీర్‌ ఆసాంతం మనస్ఫూర్తిగా, అంకితభావంతో ఆడాను.  నేను తప్పుకుని కుర్రాళ్లకు అవకాశాలివ్వాల్సిన సమయం వచ్చింది. నాకు టీమిండియా సభ్యుడినయ్యే అవకాశమిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు’ అని ప్రవీణ్‌ అన్నాడు. ఇకపై బౌలింగ్‌ కోచ్‌గా సేవలందిస్తానని చెప్పాడు.   

మరిన్ని వార్తలు