ఆ రికార్డు సృష్టించనున్న ఆ క్రికెటర్‌!

7 Jul, 2020 21:04 IST|Sakshi

ముంబై: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని టిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. భారత వెటరన్ లెగ్‌ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే క్రికెట్‌ ప్రియులందరికి తెలిసిన వ్యక్తే. 41 ఏళ్ల వయసులో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు. ఇప్పడు ప్రవీణ్‌  తాంబే మరోసారి రికార్డు సృష్టించబోతున్నాడు. 48 ఏళ్ల తాంబే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌)కు ఎంపికయ్యాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. టిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. సోమవారం జరిగిన సీపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో ప్రవీణ్‌ తాండేను టిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ దక్కించుకున్నది. అయితే తాంబే సీపీఎల్‌లో ఆడాలంటే బీసీసీఐ అనుమతి ఉండాలి. (చదవండి: ఐపీఎల్‌లో బ్యాన్‌ చేశారు కదా.. ఇంకా ఏంటి?)

కానీ ఇండియన్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం తాంబే సీపీఎల్‌ ఆడటానికి అవకాశం ఇవ్వదు. బీసీసీఐ నియమాల ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా అన్ని రకాల దేశీయ క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాతే ఇతర దేశాలలో జరిగే లీగ్‌లలో ఆడాలనుకునే ఆటగాడికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లభిస్తుంది. అంతకముందు  కెనడాలో జరిగిన గ్లోబల్ టీ 20 లీగ్ ఆడటానికి వెళ్లడానికి యువరాజ్ సింగ్  కూడా అదే చేశాడు. అయితే తాంబే రిటైర్‌మెంట్‌కు సంబంధించి ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ క్లారిటీనిచ్చింది. ప్రస్తుతం అతను రిటైర్డ్‌ అయ్యాడు అని తెలిపింది. ఈ విషయం గురించి ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం తాండే రిటైర్డ్‌ అయ్యారు. మొదట ఆయన రిటైర్‌మెంట్‌ ప్రకటించారు, కానీ తరువాత దానిని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రిటైర్డ్‌ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ఆయన ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు ఈ మెయిల్‌ ద్వారా సందేశం పంపించారు. (ఐపీఎల్‌ 2020: అతడు ఔట్‌)

ఇక తాంబే క్రికెట్‌ ఆట విషయానికి వస్తే... 2013-16 మధ్య కాలంలో ప్రవీణ్‌ తాంబే 33 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు.  28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్‌ లయన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ తరపున కూడా ఆడాడు. ఇక ప్రవీణ్‌తాంబే సీపీఎల్‌ విషయానికి వస్తే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ సీపీఎల్‌ కొత్త సీజన్‌.. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు షెడ్యూల్‌ చేశారు. భారత ప్రభుత్వం జూలై 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఒ‍కవేళ దానిని పొడిగిస్తే తాంబే ఆశల మీద నీళ్లు  చల్లినట్లే అవుతుంది. 

మరిన్ని వార్తలు