పీబీఎల్‌కు వేళాయె...

20 Jan, 2020 03:26 IST|Sakshi

నేటి నుంచి ఐదో సీజన్‌

చెన్నై: భారత స్టార్‌ ప్లేయర్స్‌ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ గైర్హాజరీలో... ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌కు సోమవారం తెర లేవనుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు సభ్యురాలిగా ఉన్న హైదరాబాద్‌ హంటర్స్‌తో మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌స్టార్స్‌ జట్టు తలపడుతుంది. మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూతురు గాయత్రితో పీవీ సింధు తలపడుతుంది. మొత్తం రూ. ఆరు కోట్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో అవధ్‌ వారియర్స్, బెంగళూరు రాప్టర్స్, ముంబై రాకెట్స్, హైదరాబాద్‌ హంటర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్, పుణే సెవెన్‌ ఏసెస్‌ జట్లు టైటిల్‌ కోసం బరిలో ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌ తరఫున హైదరాబాద్‌ ప్లేయర్, ప్రపంచ చాంపియన్‌íÙప్‌ పురుషుల సింగిల్స్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్‌ పోటీపడుతున్నాడు. ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌తో లీగ్‌ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓటమి అంచుల నుంచి...

సెరెనా సాధించేనా?

యువ భారత్‌ శుభారంభం

కంగారెత్తించాం...

గెలిచారు.. సిరీస్‌ను ముద్దాడారు

సినిమా

ఫైటర్‌కు జోడి?

బిజీ బిజీ

ఆర్చ... అదరహా

హలో బాలీవుడ్‌

గుమ్మడికాయ కొట్టారు

బుజ్జిగాడు వస్తున్నాడు

-->