ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్

12 Mar, 2015 00:37 IST|Sakshi
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్

 బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు సాయిప్రణీత్, ఆనంద్ పవార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 21-10, 21-14తో దితెర్ డోమ్కె (జర్మనీ)పై గెలిచాడు. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ శ్రీకాంత్‌కు పోటీ ఎదురుకాలేదు.
 
 ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21-11, 21-13తో బెరినో జియాన్ వోంగ్ (మలేసియా)పై, ఆనంద్ పవార్ 13-21, 22-20, 21-16తో డారెన్ లూ (మలేసియా)పై గెలిచారు. అంతకుముందు మంగళవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21-18, 21-10తో లుకాస్ కొర్వీ (ఫ్రాన్స్)పై, సాయిప్రణీత్ 21-9, 21-9తో లుకా జెడెన్‌జాక్ (క్రొయేషియా)పై, ఆనంద్ పవార్ (భారత్) 21-11, 21-13తో జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై, అజయ్ జయరామ్ (భారత్) 21-7, 21-7తో ఐదో సీడ్ హు యున్ (హాంకాంగ్)పై విజయం సాధించారు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు