కేఎల్‌ రాహుల్‌పై వేటు?

6 Sep, 2018 13:21 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి ఆరంభమయ్యే చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా అరంగేట్రం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. జట్టులో సమతుల్యత లేకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు భావిస్తోంది. ఇంగ్లీషు గడ్డపై జరుగుతున్న టెస్టు సిరిస్‌ ఆరంభం నుంచీ భారత ఓపెనర్లు వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఓపెనింగ్ జోడీగా సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌తో పాటు కేఎల్ రాహుల్‌ని కూడా జట్టు మేనేజ్‌మెంట్‌ పరీక్షించింది. అయితే, ఓపెనింగ్ స్లాట్‌లో ఈ ముగ్గురూ పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన శిఖర్ ధావన్.. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి చేసిన పరుగులు 158. ఇందులో ధావన్ అత్యధిక స్కోరు 44. ఇక కేఎల్ రాహుల్‌ కూడా మూడు టెస్టుల్లో చేసిన పరుగులు 96కాగా.. అత్యధిక స్కోరు 36గా ఉంది. మరో ఓపెనర్ మురళీ విజయ్ ఆడిన రెండు టెస్టుల్లో చేసిన పరుగులు 26కాగా.. అత్యధిక స్కోరు 20. దాంతో ఐదు టెస్టులో రాహుల్‌ను పక్కకు పెట్టి.. పృథ్వీషాకు అవకాశం ఇవ్వాలని జట్టే మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది.

మరిన్ని వార్తలు