పృథ్వీర్, పద్మశ్రీలకు స్వర్ణాలు

11 Dec, 2017 10:35 IST|Sakshi

ఆర్‌ఎఫ్‌వైఎస్‌ అథ్లెటిక్స్‌ మీట్‌  

సాక్షి, హైదరాబాద్‌: రిలయన్స్‌ ఫౌండేషన్‌ యూత్‌ స్పోర్ట్స్‌ (ఆర్‌ఎఫ్‌వైఎస్‌) అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పృథ్వీర్‌ (తెలంగాణ మైనారిటీ స్కూల్‌), పద్మశ్రీ (సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌) సత్తా చాటారు. గచ్చిబౌలిలో ఆదివారం జరిగిన 200 మీ. పరుగు జూనియర్‌ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ స్వర్ణాలను సొంతం చేసుకున్నారు. పృథ్వీర్‌ 24.24 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆర్‌. శ్రీకాంత్‌ (24.26 సె.) రెండోస్థానాన్ని, రేవంత్‌ (24.99 సె.) మూడో స్థానాన్ని సాధించారు. బాలికల విభాగంలో పద్మశ్రీ 27.55 సెకన్లలో, మానస (టీఎస్‌ఆర్‌ఎస్‌) 29.44 సెకన్లలో, శిల్ప (టీఎస్‌ఆర్‌ఎస్‌) 29.59 సెకన్లలో రేసును పూర్తిచేసి తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్‌ కాలేజి సత్తా చాటింది. సీనియర్‌ బాలబాలికల విభాగాల్లో ఆర్‌ఎఫ్‌వైఎస్‌ హైదరాబాద్‌ ‘రోల్‌ ఆఫ్‌ ఆనర్‌’ విజేతగా నిలిచింది.  

ఇతర ఈవెంట్‌ల ఫలితాలు

సీనియర్‌ బాలుర 200 మీ. పరుగు: 1. వై. హరికృష్ణ (తెలంగాణ మైనారిటీస్‌ స్కూల్‌), 2. కె. అరవింద్‌ (తెలంగాణ మైనారిటీస్‌ స్కూల్‌), 3. చందు (భవన్స్‌ శ్రీ అరబిందో).  

5000 మీ. పరుగు: 1. సౌరవ్‌ (ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌), 2. రవికిరణ్‌ (జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌), 3. కేశవ్‌ (భవన్స్‌ శ్రీ అరబిందో).

సీనియర్‌ బాలికల 5000 మీ. పరుగు: 1. గంగోత్రి (భవన్స్‌ శ్రీ అరబిందో), 2. శ్రావణి (భవన్స్‌ శ్రీ అరబిందో).

కాలేజి బాలుర 5000 మీ. పరుగు: 1. బి. రమేశ్‌ (ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజి), 2. చిదుర్ల (వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి), 3. అజయ్‌ (రైల్వే డిగ్రీ కాలేజి).

ఆర్‌ఎఫ్‌వైఎస్‌ హైదరాబాద్‌ రోల్‌ ఆఫ్‌ ఆనర్‌ విజేతల వివరాలు
జూనియర్‌ బాలురు: 1. తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్, 2. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల.

జూనియర్‌ బాలికలు: 1. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాల, 2. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌.

సీనియర్‌ బాలురు: 1. భవన్స్‌ శ్రీ అరబిందో, 2. తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌.
బాలికలు: 1. భవన్స్‌ శ్రీ అరబిందో, 2. తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌.

కాలేజి బాలురు: 1. సెయింట్‌ జోసెఫ్స్‌ డిగ్రీ కాలేజి, 2. హిందీ మహావిద్యాలయ.


బాలికలు: 1. ప్రభుత్వ డిగ్రీ కాలేజి, 2. ఫారెస్ట్‌ కాలేజ్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.  

మరిన్ని వార్తలు