సెమీస్‌లో పుణెరి పల్టన్

28 Jul, 2016 00:51 IST|Sakshi
సెమీస్‌లో పుణెరి పల్టన్

యు ముంబాకు నిరాశ

న్యూఢిల్లీ: నాకౌట్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పుణెరి పల్టన్ సత్తా చాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 36-33తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. దీంతో 42 పాయింట్లతో జాబితాలో నాలుగో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ట్యాక్లింగ్‌లో మంజిత్ చిల్లర్ (11), రైడింగ్‌లో దీపక్ నివాస్ హుడా (9)లు అద్భుతంగా రాణించారు. ఈ ఇద్దరి జోరుతో పుణెరి ఏ దశలోనూ పాయింట్ల కోసం ఇబ్బంది పడలేదు.  

 
మరో మ్యాచ్‌లో యు ముంబా 38-34తో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించినా.. సెమీస్ బెర్త్‌ను సాధించలేకపోయింది. 42 పాయింట్లతో పుణెరి పల్టన్, యు ముంబా సమఉజ్జీగా ఉన్నా... ఓవరాల్ స్కోరు సగటులో యు ముంబా (-18) కంటే పుణెరి (+23) మెరుగ్గా ఉండటంతో ఆ జట్టుకు సెమీస్ బెర్త్ దక్కింది. ప్రొ కబడ్డీ లీగ్ మూడు సీజన్లలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు ఒకసారి విజేతగా నిలిచిన యు ముంబా ఈసారి లీగ్ దశలోనే నిష్ర్కమించడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు