కోహ్లీకి ఖేల్ రత్న, రహానేకు అర్జున సిఫార్సు

4 May, 2016 00:38 IST|Sakshi
కోహ్లీకి ఖేల్ రత్న, రహానేకు అర్జున సిఫార్సు

* అర్జునకు రహానే  
* బీసీసీఐ ప్రతిపాదన

న్యూఢిల్లీ: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర’కు బీసీసీఐ ప్రతిపాదించింది. అలాగే అర్జున అవార్డు కోసం అజింక్యా రహానే పేరును కూడా క్రీడా శాఖకు సిఫారసు చేసింది. వీరిద్దరి పేర్లను సెలక్షన్ కమిటీకి పంపినట్టు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఖేల్త్న్ర కోహ్లిని వరిస్తే నాలుగేళ్ల అనంతరం ఈ అవార్డును దక్కించుకున్న మూడో క్రికెటర్‌గా నిలుస్తాడు.

గతంలో సచిన్, ధోని అందుకున్నారు. ఖేల్ రత్నకు రూ.7.5 లక్షలు, అర్జునకు రూ.5 లక్షలు అందిస్తారు. ఈ పురస్కారం విషయంలో కోహ్లికి స్క్వాష్ చాంపియన్ దీపికా పళ్లికాల్, గోల్ఫర్ అనిర్బాన్ లాహిరి, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత షూటర్ జితూ రాయ్, రన్నర్ టింటూ లూకాలతో  పోటీ ఎదురుకానుంది.

మరిన్ని వార్తలు