శభాష్ ద్రవిడ్: గంభీర్

28 Jan, 2017 12:45 IST|Sakshi
శభాష్ ద్రవిడ్: గంభీర్

న్యూఢిల్లీ: బెంగళూరు యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. .క్రీడల్లో ఓ సబ్జెక్టును ఎంచుకుని పరిశోధించిన తరువాత డాక్టరేట్‌ను సంపాదిస్తాను తప్ప గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించడానికి సిద్ధంగా లేనంటూ ద్రవిడ్ తన హుందాతనాన్ని చాటుకున్నాడు.

ఈ నెల 27న బెంగళూరు యూనివర్సిటీ 52వ స్నాతకోత్సవం సందర్భంగా ద్రవిడ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తామని ప్రకటించగా అతను పైవిధంగా స్పందించాడు. తాను పరిశోధించలేని అంశంపై డాక్టరేట్ను తీసుకోవడానికి సిద్ధంగా లేనని ద్రవిడ్ అతి సున్నితంగా తిరస్కరించడంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపించారు. ఇలా ద్రవిడ్ పై ప్రశంసించిన వారిలో భారత క్రికెటర్ గౌతం గంభీర్ కూడా చేరిపో్యాడు.'శభాష్ ద్రవిడ్..ఒక సబ్జెక్ట్ను పరిశోధించిన తరువాత మాత్రమే డాక్టరేట్ను స్వీకరిస్తానన్న నీ వ్యాఖ్యలు నిజంగా అభినందనీయం.  నీవు హుందాగా వ్యవహరించి గౌరవ డాక్టరేట్ను తిరస్కరించడం గర్వంగా ఉంది'అని గంభీర్ ట్వీట్లో పేర్కొన్నాడు.

 

 

 

 

 

 

మరిన్ని వార్తలు