2020 ఒలంపిక్స్‌లో కూడా స్వర్ణం ఆమెదేనా?  

28 Aug, 2019 14:02 IST|Sakshi

పీటీ ఉష ఒడిలో ఒదిగిపోయిన పీవీ సింధు అరుదైన ఫోటో

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌-2019లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సాధించిన ఈ ఘనతపై జాతీయంగా, అంతర్జాతీయంగా సింధుపై  అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించిన ప్రతీ చిన్నవిశేషం కూడా క్రీడాభిమానులను, యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మరో  భారతీయ గోల్డెన్‌ గర్ల్‌ , పరుగుల రాణి పద్మశ్రీ  పీటీ ఉషతో కలిసి వున్న సింధు చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో ఆకర్షిస్తోంది. పీటీ ఉష సింధుకు అభినందనలు తెలుపుతూ పీవీ సింధు చిన్నప్పుడు తనతో కలిసి దిగిన 18 ఏళ్ల క్రితంనాటి ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో మీరిద్దరు దేశానికి గర్వ కారణమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా, పలువురు క్రీడాభిమానులు, ఇతర అభిమానులు  అరుదైన ఆ ఫోటోకు లైక్స్‌ కొడుతూ షేర్‌ చేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

 చదవండి :‘దారుణమైన వర్కవుట్లు; కాబట్టే సింధూ గెలిచింది’

ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు బంగారు పతకం గెలవడంతో ఆమెని అభినందించిన పీటీ ఉష 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు స్వర్ణాన్ని గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఆమె ఇప్పటికే రజత పతకం గెలిచింది. పసిడిపై గురి పెడితే కచ్చితంగా చేజిక్కించుకోగలదంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు పీవీ సింధు  ప్రపంచ పోటీకి ముందు  కఠోర సాధన చేస్తున్న వీడియో ఒకటి  టాక్‌ ఆఫ్‌ ది యూత్‌గా  నిలిచింది.  2020 స్వర్ణం కూడా సింధూకే సొంతం కావాలంటూ  బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నారు.

(చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా