మళ్లీ ట్రాక్ మీదకు పి.టి. ఉష

20 Oct, 2014 12:23 IST|Sakshi
మళ్లీ ట్రాక్ మీదకు పి.టి. ఉష

అలనాటి పరుగుల రాణి పీటీ ఉష మళ్లీ ట్రాక్ మీదకు రాబోతోంది. గుజరాత్లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్రమోదీ కోరడంతో.. గుజరాత్లో కొంతమంది బాలలను ముందుగా వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి ఉష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అక్కడ 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వాళ్లకు ప్రాథమిక శిక్షణ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యం. ఇందుకోసం 10-11 ఏళ్ల వయసున్న పిల్లలను ఎంపిక చేస్తారు.

సియోల్ ఒలింపిక్స్లో భారత పతాకాన్ని అథ్లెటిక్స్ విభాగంలో పీటీ ఉష రెపరెపలాడించిన విషయం తెలిసిందే. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది, వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని క్రీడా వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే ఆమె తన ఊరు సమీపంలో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను తెరిచింది. ఇటీవల ఆమె స్కూలు నుంచి వచ్చిన ముగ్గురు బాగా ప్రతిభ చూపారు. ఈ నేపథ్యంలో గుజరాత్ నుంచి మంచి మెరికల్లాంటి అథ్లెట్లను తయారుచేసేందుకు ఉష సేవలను వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ భావించారు.

మరిన్ని వార్తలు