ఫలించిన పంజాబ్ వ్యూహం

11 May, 2017 22:10 IST|Sakshi
ఫలించిన పంజాబ్ వ్యూహం

► సాహా విజృంభణ.. ముంబైకి భారీ లక్ష్యం
► రాణించిన మాక్స్ వెల్, గప్టిల్, షాన్ మార్ష్

ముంబై: కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ బ్యాట్స్ మెన్  వృద్దిమాన్ సాహా 93 పరుగులతో విజృంభించడంతో పంజాబ్ ముంబైకి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరో వైపు ఓపెనర్ ఆమ్లా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సాహాను ఓపెనర్ గా ప్రయత్నించిన పంజాబ్ వ్యూహం ఫలించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు.  ఇక మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహా లు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు పిండుకున్నారు. ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది. వేగంగా ఆడుతున్న మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా కు చిక్కాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్, సాహా తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మాక్స్ వెల్ హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్ లు బాదడంతో జట్టుకు 21 పరుగులు చేరాయి. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసిన మాక్స్ వెల్ బూమ్రా బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షాన్ మార్ష్ తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు. హార్భజన్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

సాహా కి తోడుగా మార్ష్ కూడా చెలరేగడంతో 15 ఓవర్లకే పంజాబ్ 173 పరుగులు చేయగలిగింది.ఈ తరుణంలో భారీ షాట్ కుప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన వారంతా పోటా పోటిగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పంజాబ్ 18 ఓవర్లోనే 200 పరుగులకు చేరుకొంది. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధికంగా 230 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కరణ్ శర్మ, మెక్లిన్ గన్ లకు తలో వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు