రెండో రౌండ్లో సింధు

26 Apr, 2017 19:13 IST|Sakshi
రెండో రౌండ్లో సింధు

వుహాన్:ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో సింధు 21-8, 21-18 తేడాతో ఆయుస్టినీ (ఇండోనేషియా)పై విజయం సాధించి రెండో రౌండ్ లో కి ప్రవేశించింది. కేవలం 31 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఏకపక్ష విజయం సాధించింది. తొలి గేమ్‌ను అవలీలగా దక్కించుకున్న సింధు.. రెండో గేమ్‌లో కాస్త శ్రమించి గెలుపును సొంతం చేసుకుంది.

 

మరొకవైపు సైనా నెహ్వాల్ పోరాటం తొలి రౌండ్ లోనే ముగిసింది. సైనా నెహ్వాల్ 21-19, 16-21, 18-21 తేడాతో సయకా సాటో(జపాన్) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ ను గెలిచినప్పటికీ, మిగతా గేమ్‌ల్లో అనవసర తప్పిదాలు చేయడంతో సైనా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మరిన్ని వార్తలు