హైదరాబాద్‌ చేరుకున్న సింధు

27 Aug, 2019 20:05 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు నగరానికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సింధుకు తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ దినకరన్‌ బాబు తదితరులు సింధుకు ఘనస్వాగతం​ పలికారు. బేగంపేట నుంచి పుల్లెల గోపీచంద్‌ అకాడమీకి సింధు బయల్దేరి వెళ్లనున్నారు.

అంతకముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సింధు కలిశారు.  సింధుతో పాటు తన నివాసానికి వచ్చిన కోచ్‌ గోపీచంద్‌లను మోదీ అభినందించారు. దీనిలో భాగంగా సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు మోదీ. అనంతరం సింధుతో దిగిన ఫొటోలను ట్వీటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.  చాంపియన్‌ సింధును కలవడం చాలా సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు