సింధు శుభారంభం

23 Oct, 2019 02:13 IST|Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ

పారిస్‌: ఈ ఏడాది తొలి వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ కోసం వేచి చూస్తున్న ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సింధు 21–15, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ మిచెల్లి లీ (కెనడా) పై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ కు చేరుకుంది.గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్‌ యో జియా మిన్‌ (సింగపూర్‌)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో శుభాంకర్‌ డే సంచలనం సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్‌ శుభాంకర్‌ డే 15–21, 21–14, 21–17తో ప్రపంచ 17వ ర్యాంకర్‌ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మరోవైపు మంగళవారం విడుదలైన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ కెరీర్‌ బెస్ట్‌ 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వలసలు దెబ్బ తీస్తున్నాయి

పేస్‌ బౌలింగ్‌ సూపర్‌

ఫ్రీడం ట్రోఫీ భారత్‌ సొంతం

ధోని, సచిన్‌ తర్వాతే.. గౌతమ్‌, సన్నీ లియోన్‌

బీసీసీఐపై యువీ, భజ్జీ అసంతృప్తి

స్పందిస్తే చాలా సిల్లీగా ఉంటుంది: డీకే

నాట్యం చేయించడం సంతోషంగా ఉంది

నాలో నేనే మాట్లాడుకున్నా: రోహిత్‌

అమ్మో...టీమిండియా చాలా కష్టం!

ధోని గురించి ఏమీ మాట్లాడలేదు: కోహ్లి

15 ఏళ్ల తర్వాత టీమిండియా పిలుపు..

ఐపీఎల్‌ను సాగదీస్తున్నారు!

విజేతలు మనోహర్‌ కుమార్, నటరాజ్‌ శర్మ

స్విమ్మింగ్‌లో శివానికి ఐదు స్వర్ణాలు

రోహిత్‌ మరో రికార్డు

విరాట్‌ ఎవ్వరికీ అందనంత ఎత్తులో

టీమిండియా నయా చరిత్ర

వైరల్‌ : కునుకు తీసిన రవిశాస్త్రి

బంగ్లాదేశ్‌ వస్తుందా భారత్‌కు?

ముంబై ఆశలపై వర్షం

సింధుకు మరో సవాల్‌

నేడే క్లీన్‌స్వీప్‌

సమ్మెకు దిగిన క్రికెటర్లు.. 

తన్మయత్వంలో ‘వారిద్దరు’

భారీ విజయం ముంగిట టీమిండియా

సూపర్‌ ఛాన్స్‌ కొట్టేసిన మెక్‌డొనాల్డ్‌

సాహా ఔట్‌.. రిషభ్‌ ఇన్‌

ధోని రిటైర్మెంట్‌ కాలేదు కదా? మరి..

షమీ విజృంభణ

కోహ్లినే ప్రత్యర్థిని ఎక్కువ ఆహ్వానించాడు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా ఏపీ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా

సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్‌ ముందుంటారు

ఫారిన్‌ పోదాం రాములా!

నీ పరిచయం తర్వాత అన్నీ మధుర క్షణాలే

డార్లింగ్‌కి శుభాకాంక్షలు

వైరలవుతున్న అలియా, రణ్‌బీర్‌ వెడ్డింగ్‌ కార్డు!