మనోళ్ల సత్తాకు పరీక్ష 

23 Jul, 2019 07:45 IST|Sakshi

నేటి నుంచి జపాన్‌ ఓపెన్‌ టోర్నీ

బరిలో సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్‌  

టోక్యో : ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. నేడు మొదలయ్యే జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్‌ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రోజు పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో పదో ర్యాంకర్‌ కెంటో నిషిమోటా (జపాన్‌)తో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ ఆడనున్నాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో గో సె ఫె–నూర్‌ ఇజుద్దీన్‌ (మలేసియా)లతో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి; మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో మార్విన్‌ సీడెల్‌–లిండా ఎఫ్లెర్‌ (జర్మనీ)లతో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప తలపడతారు. బుధవారం జరిగే సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో హాన్‌ యుయె (చైనా)తో పీవీ సింధు; ప్రణయ్‌తో శ్రీకాంత్‌; ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)తో సమీర్‌ వర్మ పోటీపడతారు. గతవారం ఇండోనేసియా ఓపెన్‌ టోర్నీలో ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచిన సింధుకు ఈ టోర్నీలో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌ను అధిగమిస్తే ఆమె ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కిర్‌స్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌) లేదా అయా ఒహోరి (జపాన్‌)తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సింధుకు క్వార్టర్‌ ఫైనల్లో ఇండోనేసియా ఓపెన్‌ విజేత అకానె యామగుచి (జపాన్‌), సెమీఫైనల్లో రెండో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా) ప్రత్యర్థులుగా ఎదురు కావొచ్చు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పంజా

శ్రీజ తీన్‌మార్‌

టోక్యో ఎంత దూరం?

యు ముంబా చిత్తుచిత్తుగా

బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు

సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్‌ ఎగతాళి

‘ఆ క్రెడిట్‌ అంతా గంభీర్‌దే’

‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

‘ఇక పాక్‌ క్రికెట్‌ జట్టును నేను సెట్‌ చేస్తా’

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ఓడితే బ్యాట్‌ పట్టుకునే వాడిని కాదు: ఇంగ్లండ్‌ క్రికెటర్‌

సచిన్‌ సూచనకు ఓటేసిన బౌలింగ్‌ కోచ్‌

కేదార్‌ జాదవ్‌ ఎందుకు బాస్‌?

ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర!

శుబ్‌మన్‌ గిల్‌ టాప్‌ లేపాడు..

సలామ్‌ బాస్‌: రిషభ్‌

శ్రీశ్వాన్‌కు ఐఎం హోదా

విజేతలు సచిన్, ప్రహర్షిత

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

రన్నరప్‌తో సరి

శ్రీజ తడాఖా

నాది నిర్ణయలోపమే

క్వార్టర్స్‌లో నిఖత్‌

రాయుడిపై వివక్ష లేదు

విండీస్‌ సిరీస్‌కు సై

నచ్చారండి.. హిమదాస్‌

నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అంపైర్‌

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా : ఎమ్మెస్కే

‘శారీ ట్విటర్‌’ .. క్రికెటర్‌కు ముద్దు పెట్టింది

అది ధోనికి తెలుసు: ఎమ్మెస్కే ప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ