సింధుని వీడని ఫైనల్‌ ఫోబియా!

21 Jul, 2019 15:06 IST|Sakshi

ఇండోనేసియా ఓపెన్‌ ఫైనల్లో ఓడిన భారత స్టార్‌ షట్లర్‌ 

ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి చేతిలో ఓటమి

జకార్తా : సీజన్‌లో తొలి టైటిల్‌ లోటును తీర్చుకోవాలని భావించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్‌ ఫోబియాతోనే మరోసారి టైటిల్‌ అందుకోలేకపో​యింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి(జపాన్‌) 21-15, 21-16 ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధుపై అలవోక విజయం సాధించింది. 51 నిమిషాల్లో ముగిసిన పోరులో యామగుచి ఏకపక్ష విజయం సాధించింది. మ్యాచ్‌ తొలి గేమ్‌లో భాగంగా మొదటి అర్థభాగం వరకూ సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. ఆపై తేరుకున్న యామగుచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో యామగుచి,సింధుతో ఉన్న ముఖముఖి రికార్డును 5-10కి మెరుగు పరుచుకుంది. 


 

మరిన్ని వార్తలు