క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

26 Jul, 2019 05:45 IST|Sakshi

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ  

టోక్యో: మరోసారి సాధికారిక ఆటతీరును ప్రదర్శించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, భమిడిపాటి సాయిప్రణీత్‌ జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు 11–21, 21–10, 21–13తో ప్రపంచ 20వ ర్యాంకర్‌ అయా ఒహోరి (జపాన్‌)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ 21–13, 21–16తో ప్రపంచ 17వ ర్యాంకర్‌ కాంటా సునెయామ (జపాన్‌)ను ఓడించాడు.

హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. రాస్‌ముస్‌ గెమ్కే (డెన్మార్క్‌)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్‌ 9–21, 15–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట 15–21, 21–11, 21–19తో హువాంగ్‌ కాయ్‌ జాంగ్‌– లియు చెంగ్‌ (చైనా) జోడీపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 16–21, 17–21తో దెచాపోల్‌–సప్‌సిరి (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్‌)తో సింధు; సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్‌; తకెషి–కీగో సొనోడా (జపాన్‌)లతో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి తలపడతారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింగమలింగై

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

ఒప్పొందం నుంచి తప్పుకుంది

తలైవాస్‌ చేజేతులా..

టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

టీమిండియాతో ఒప్పో కటీఫ్‌!

గంగూలీ వాదనకు కాంబ్లీ నో!

‘కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించండి’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌

మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ ఎంపికపై సమీక్ష

ఎఫైర్ల వివాదంలో ఇమాముల్‌ హక్‌!

ధోని జెర్సీ నంబర్‌ ఎవరికి?

ఫీల్డింగ్‌ కోచ్‌ బరిలో జాంటీ రోడ్స్‌

త్వరలో స్పోర్ట్స్‌ స్కూల్‌పై సమీక్ష

టోక్యో ఒలింపిక్స్‌ పతకాల ఆవిష్కరణ

నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం

ప్రాణం తీసిన పంచ్‌

సింధు ముందుకు... శ్రీకాంత్‌ ఇంటికి

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి

నేను తప్పులు చేశా...

జపాన్‌ ఓపెన్‌: శ్రీకాంత్, సమీర్‌ ఔట్‌

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి..

గర్జించిన బెంగాల్‌‌.. కుదేలైన యూపీ

‘సారథిగా తప్పుకుంటే నీకే మంచిది’

ఆర్చర్‌.. టైమ్‌ మిషన్‌ ఉందా ఏందీ?

సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

అవే నన్ను రాటుదేలేలా చేసాయి : కోహ్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం